టీటీడీ వివాదాస్పద నిర్ణయం.. ఇకపై నిజపాద సేవ దర్శనం రద్దు

తిరుమల : టీటీడీ(TTD) వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి శ్రీవారి నిజపాద సేవ దర్శనాన్ని అధికారులు రద్దు చేశారు. గతంలో వలే 8 గంటలకు బ్రేక్ దర్శనానికి అనుమతించనున్నారు. గతవారం నిజపాద దర్శనం సమయంలో.. వీఐపీ(VIP) బ్రేక్ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతి లభించనుంది. అర్చకులను సంప్రదించకుండానే బ్రేక్ దర్శనాన్ని టీటీడీ అమల్లోకీ తెచ్చింది. ఆలయ సంప్రదాయాలు, పూజా కైంకర్యాల విషయంలోనూ.. అర్చకులను సంప్రదించకుండానే టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. బ్రేక్ దర్శనం సమయంలో భక్తులకు హారతి, తీర్ధం.. శఠారి ఇచ్చే అవకాశం లేకపోవడంతో టీటీడీపై వీఐపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీల ఆగ్రహంతో ఈవారం నిజపాద దర్శన సమయంలో.. బ్రేక్ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులను మాత్రమే టీటీడీ దర్శనానికి అనుమతించనుంది.

Post a Comment

Previous Post Next Post